- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగుల చవితి సందర్భంగా ఆ ఆలయంలో ఎమ్మెల్యే చల్లా ప్రత్యేక పూజలు
దిశ, పరకాల: పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానంకు కార్తీక మాసం మొదటి సోమవారం, నాగులచవితి పర్వదినము సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణలచే శివునికి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలలో వరంగల్ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కార్తీక మాసం, నాగుల చవితిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుట్టకు పాలు పోసే కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిత్యాన్నదాన కార్యక్రమంను పరకాల ఏఎమ్‌సి చైర్మన్ బండి సారంగపాణి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారని ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ, కమిషనర్ శేషు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్తలు, తెరాస పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీశైలం, మార్కెట్ డైరెక్టర్లు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.