ఐపీఎల్ ఆటగాళ్ల కోసం విమానాశ్రయంలో స్పెషల్ టెర్మినల్

by Shiva |
ఐపీఎల్ ఆటగాళ్ల కోసం విమానాశ్రయంలో స్పెషల్ టెర్మినల్
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ ఎంత బలమైన క్రీడా సంస్థో మరో సారి వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ ఫస్ట్ లెగ్‌లో భాగంగా ముంబయి, చెన్నై వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడ కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఐపీఎల్ కోసం ముంబయి వచ్చే క్రీడాకారులు అక్కడి చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. అయితే సాధారణ ప్రయాణికులతో కలవకుండా వారిని వేరే టెర్మినల్ ద్వారా బయటకు అనుమతించాలని బీసీసీఐ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు విమానాశ్రయ అధికారులను కోరారు.

దీంతో చార్టెడ్ ఫ్లైట్స్ కోసం ఉపయోగించి కలీనా టెర్మినల్‌ను ఉపయోగించుకోవాడనికి అనుమతులు మంజూరు చేశారు. అయితే డీజీసీఏ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉన్నది. ముంబయి చేరుకునే క్రికెటర్లు కలీనా టెర్మినల్ ద్వారా బయటకు వచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. విదేశీ క్రికెటర్లు అయితే సొంత ఖర్చులతో 7 రోజుల ప్రభుత్వ క్వారంటైన్‌లో ఆ తర్వాత ఐపీఎల్ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed