- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్.. ఎందుకో తెలుసా..?
దిశ, ఖమ్మం : మహిళలకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ దోహదపడుతుందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్లకు మహిళలు మరింత స్వేచ్చగా, నిర్భయంగా, స్నేహపూర్వకంగా చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఉమెన్ హెల్ప్ డెస్క్ కు అవసరమైన స్టెషనరీ ఈరోజు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా స్టేషన్ సిబ్బందికి అందజేశారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులంటే అపోహలు పోగొట్టి, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో కిందిస్థాయి సిబ్బందికి శిక్షణలో నిర్దేశించామని అన్నారు.
మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ.. తద్వారా మహిళలు తమ సమస్యను నిర్భయంగా చెప్పడానికి, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం, పునరావాసం సులభతరం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 23 పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి , ఏఆర్ ఏసీపీ విజయబాబు, ఉమెన్ సిఐ అంజలి, ఆర్ ఐలు రవి, శ్రీనివాస్ , తిరుపతి , సాంబశివరావు , శ్రీ శైలం పాల్గొన్నారు.