దివ్యాంగులకు ప్రత్యేక నిధి: హైకోర్టు ఆదేశం

by Shyam |
High court
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల మంది దివ్యాంగులకు కోటి రూపాయలు సరిపోతాయా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగానే దివ్యాంగులు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. దివ్యాంగులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రతీ జిల్లాకు రూ.10 వేల చొప్పున మొత్తంగా కోటి రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం ఏడు లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఈ చర్యలు సరిపోవని, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు సాయం కోసం దివ్యాంగులు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story