వరుస ప్రమాదాలు.. ప్రభుత్వం అలర్ట్

by Anukaran |
వరుస ప్రమాదాలు.. ప్రభుత్వం అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వీటిని నివారించేందుకు ప్రత్యేక కమిటీ నియమించింది. ఇక నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది. పరిశ్రమల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇందుకోసం జిల్లా స్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఎలాంటి జాగ్రత్తలైనా 30 రోజుల్లోపే తీసుకునేలా చూడాలని, 90 రోజుల్లోగా స్పెషల్ డ్రైవ్ ను పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది. పరిశ్రమలు, ప్రమాద కెమికల్స్, పేలుడు పదార్థాలు, రెడ్ కేటగిరి పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ప్రతి పరిశ్రమను తనిఖీ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నది.

Advertisement

Next Story