ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2021-06-21 08:39:16.0  )
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. విశాఖపట్నం తీరప్రాంత పర్యాటక, వాణిజ్య, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ బీచ్‌రోడ్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ పేరుతో విశాఖ-భీమిలి-భోగాపురం ప్రాంతాలకు ఈ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. మొత్తం 570 ఎకరాల్లో రూ. 1,021 కోట్ల అంచనాలతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. దీనిలో భాగంగా పీపీపీ విధానంలో విశాఖ బీచ్‌రోడ్‌లో రిసార్టులు, గోల్ఫ్‌ కోర్టుల నిర్మాణం, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్‌ షిప్‌ రెస్టారెంట్‌ను ‌అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story