- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టులకు షాక్.. వేటమొదలెట్టిన గ్రేహౌండ్స్
దిశ, చెన్నూర్ : ప్రాణహిత పరివాహక ప్రాంతంలో స్పెషల్ పార్టీస్, క్యాట్ పార్టీస్, గ్రేహౌండ్స్ బలగాలతో ముమ్మర తనిఖీలు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. 21-09-2021 నుండి 27-09-2021 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రాత్రింబవళ్లు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనీ సిఐలు, ఎస్సైల నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, విధ్వంసాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
రామగుండం కమిషనరేట్ ఓఎస్డీ పర్యవేక్షణలో సిర్వంచ నుండి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహనలను, చెన్నూర్ ప్రాంతం నుండి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనలను ఆపి, అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్నారు. వాహనాలను పోలీసు అధికారుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వారి వివరాలు సేకరించి, విచారిస్తున్నామన్నారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ , ఎస్ఐ రవి కుమార్, ప్రొబేషనరీ ఎస్ఐలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.