- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమకోసమై.. గిజిగాని వీర ప్రేమ ‘గూడు’
దిశ,వెబ్‌డెస్క్ : అమ్మాయిల నుంచి ప్రేమను పొందడానికి అబ్బాయిలు ఎన్నికష్టాలు పడుతారో చెప్పనవసరం లేదు. అయితే ఈ కష్టాలు మనుషులకే కాదండోయి.. పక్షులకు కూడా ఉంటుంది. ఏంటీ పక్షులు ప్రేమ పొందడం అనుకుంటున్నారా.. గిజిగాని గురించి మనం చిన్నప్పుడు పుస్తకాలల్లో చదువుకునే ఉంటాం.. మన నాన్నమ్మ, తాతయ్యలు కథలు చెప్తే వినే ఉంటాము కదా. గిజిగాడు అంటే పిచ్చుక(పిట్ట). అది ఎంతో అందంగా పసిడి కిరీటం లాంటి పసుపు రంగు గడ్డమూ, ముక్కూ, రంగేమో నలుపు, రెక్కలేమో గోధుమ, నలుపు చారలతో మగ గిజిగాళ్ళు చాలా అందంగా ఉంటాయి. కానీ ఆడ గిజిగాడు కాస్త ఊర పిచ్చుకలను పోలి ఉంటాయి.
రాణి ప్రేమ కోసం రాజులు యుద్ధాలే చేశారు అంటారుగా.. అలా గిజిగాడు ఆడ పక్షి ప్రేమ పొందడానికి గూడు ఏర్పాటు చేస్తాడు. గిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనంతో ఉంటుంది. గడ్డిపోచలు పోగుచేసి ముక్కున కరుచుకుని వచ్చి గిజిగాడు గూడు నిర్మిస్తాడు. గిజిగాడు గూడు నిర్మాణం ఇంజనీరింగ్ లకు సైతం అర్థం కానంతలా అద్భుతంగా ఉంటుంది.
మగ గిజిగాడు గూడు సగం అల్లాక, రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేస్తున్న గూడు చూడమన్నట్లు సంకేతం చేస్తుంది. గుంపులో ఉన్న ఒక్క ఆడపక్షినా మెచ్చక పోతే దాన్ని అలాగే వదిలేసి, మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగపక్షి. గూడు కట్టిన మగపక్షితోనే ఆడ పక్షి జత కడుతుంది. గాలి, వాన, చలి, వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనట. మంచిగా గూడు కట్టే ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది కదా. పాపం గిజిగాడు ప్రేమ కోసం ఎన్ని కష్టాలో.