అతనికి 5000 మందితో సెక్స్ రిలేషన్స్.. కోరికల నియంత్రణకు సీక్రెట్ ఆపరేషన్?

by Shyam |   ( Updated:2021-10-25 11:17:41.0  )
అతనికి 5000 మందితో సెక్స్ రిలేషన్స్.. కోరికల నియంత్రణకు సీక్రెట్ ఆపరేషన్?
X

దిశ, ఫీచర్స్ : స్పెయిన్ మాజీ కింగ్ జువాన్ కార్లోస్ సెక్స్ కోరికలను తగ్గించేందుకు స్పానిష్ సీక్రెట్ సర్వీస్.. ఆయనపై కొత్త చికిత్సా విధానాన్ని ప్రయోగించిందని ఆ దేశ తఎక్స్ పోలీస్ చీఫ్ వెల్లడించారు. 83 ఏళ్ల బహిష్కృత చక్రవర్తి కామవాంఛను తగ్గించేందుకు స్పెయిన్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్(CNI) అతనికి ‘ఆడ హార్మోన్లు, టెస్టోస్టెరాన్ ఇన్హిబిటర్లను అందించాల్సి వచ్చింది’ అని బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న మాజీ పోలీస్ కమిషనర్ జోస్ మాన్యుయెల్ విల్లారెజో పార్లమెంటరీ విచారణలో తెలిపారు.

జువాన్ కార్లోస్ బలహీనత వల్ల దేశానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున బాడీలోకి ఫిమేల్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసిన విషయాన్ని బయటపెట్టారు. కార్లోస్ ట్యూమర్‌కు సంబంధించిన చికిత్స పొందుతున్నప్పుడు చేసిన స్కాన్స్‌కు సంబంధించిన మెడికల్ రిపోర్టులు రికవరీ చేసే పనిని తనకు అప్పగించారని ఈ మాజీ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. ఆ రిపోర్ట్స్‌లో బ్రోమైడ్ (మత్తుమందు) జాడలు లేవు కానీ టెస్టోస్టెరాన్ ఇన్హిబిటర్స్ ఉన్నాయన్నారు. కాగా స్పానిష్ రచయిత, సైనిక చరిత్రకారుడు అమేడియో మార్టినెజ్ ఎంగిల్స్.. జువాన్ కార్లోల లైంగిక చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలతో ఆయనను ఒక ‘సెక్స్ బానిస’గా అభివర్ణిస్తూ ‘జువాన్ కార్లోస్ : ది కింగ్ ఆఫ్ 5,000 లవర్స్’ అనే పుస్తకం రాసిన తర్వాత ఈ విషయాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ మాజీ రాజుకు తన భార్య క్వీన్ సోఫియాతో పాటు డానిష్-జర్మన్ ఫిలాంత్రపిస్ట్ కొరీనా లార్సెన్, స్పానిష్ సింగర్ సారా మోంటీల్, బెల్జియన్ గవర్నెస్ లిలియానే సార్టియో, ఇటాలియన్ యువరాణి, గాబ్రియేలా డి సబోయా సహా 5,000 మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు అంచనా వేయబడింది.

ఇక మాజీ పోలీస్ చీఫ్ విల్లారేజో విచారణ ఈ నెలలోనే ప్రారంభించబడగా.. పలువురు పవర్‌ఫుల్ క్లయింట్ల తరపున బ్లాక్‌మెయిల్ చేయడం లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఉన్నత వర్గాలతో రహస్య సంభాషణలు రికార్డ్ చేసినట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అపఖ్యాతి పాలైన జువాన్ కార్లోస్ తన కామవాంఛలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో తన ప్రమేయాన్ని విల్లారేజో ఖండించాడు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న కింగ్ మాజీ ప్రేయసి కొరీనా లార్సెన్ ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నట్లు స్పష్టం చేశాడు. కాగా 1975 నుంచి 2014 వరకు స్పెయిన్‌ను పాలించిన ఈ ఎక్స్ కింగ్.. తన కొడుకు కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. ఈ క్రమంలో లక్షలాది డాలర్ల అవినీతి కుంభకోణంతో గతేడాది స్పెయిన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబికి పారిపోయాడు.

పూర్తిగా బట్టలు విప్పేయమంటూ వాట్సాప్‌లోనే 300 మందితో శృంగారం.. మూడ్‌లోకి వచ్చాక..

Advertisement

Next Story

Most Viewed