నలుగురితో.. మరో అంతరిక్ష యాత్ర

by Harish |
నలుగురితో.. మరో అంతరిక్ష యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ మే నెలలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ఇద్దరు ఆస్ట్రోనాట్స్ విజయవంతంగా పంపిన విషయం తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అద్భుతాలు సృష్టిస్తున్ ‘స్పేస్ ఎక్స్’ మరోసారి మానవసహిత అంతరిక్ష యాత్రకు సన్నద్ధమవుతోంది.

గతంలో ఇద్దరు వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు పంపించగా, వాళ్లు ఆగస్టులో తిరిగి క్షేమంగా భూమిని చేరుకున్నారు. ఈ క్రమంలోనే ‘స్పేస్ ఎక్స్’ ఈసారి నలుగురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపనుంది. అమెరికాకు చెందిన మైకేల్‌ హాప్కిన్స్‌, విక్టర్‌ గ్లోవర్‌, శనాన్‌ వాకర్‌లతో పాటు జపాన్‌కు చెందిన సోచి నగూచీలు అంతరిక్షానికి బయలుదేరనున్నారు. ఈ ప్రయోగానికి ‘నాసా’ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, శనివారం రాత్రి 7.49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు రాకెట్‌ బయలుదేరనుంది.

రాబోయే 15 నెలల్లో నాసా కోసం క్రూ, కార్గోలకు సంబంధించిన ఏడు క్రూ డ్రాగన్ మిషన్లను చేయబోతున్నామని ‘స్పేస్ ఎక్స్’ క్రూ హెడ్ బెంజి తెలిపాడు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది మార్చిలో మరో మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్పేస్‌ఎక్స్‌ స్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తెలిపాడు. ఇందులో ఓ యూరోపియన్, ఓ జపనీస్, ఇద్దరు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ఉంటారని వెల్లడించాడు.

ఆస్ట్రోనాట్స్‌‌కు రెగ్యులర్‌ ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించడానికి ‘స్పేస్ ఎక్స్’ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ డెవలప్ చేసినట్లు నాసా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story