- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు కల్పనాచావ్లా పేరు!
దిశ, వెబ్‌డెస్క్:
అంతరిక్షం, ఎరోనాటిక్స్, డిఫెన్స్ పనులను చూసుకునే నాసాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ వారి తాజా మిషన్ స్పేస్‌క్రాఫ్ట్ కోసం కల్ఫనా చావ్లా పేరు పెట్టింది. భారత సంతతికి చెందిన మొదటి మహిళ వ్యోమగామి జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ వారు నిర్వహిస్తున్న ఎన్‌జీ-14 మిషన్ ద్వారా సైగ్నస్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ చేయనున్నారు. దీనికే ‘కల్పనా చావ్లా స్పేస్‌క్రాఫ్ట్’ అని పేరు పెట్టి అంటారేస్ రాకెట్ ద్వారా పంపించనున్నారు. మానవుల అంతరిక్షయానంలో ముఖ్యమైన పాత్ర పోషించినవారి పేర్లను సైగ్నస్ స్పేస్‌క్రాఫ్ట్‌లకు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని నార్త్‌రోప్ గ్రుమ్మన్ సంస్థ తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కల్పనాచావ్లా పేరు పెట్టినట్లు ప్రకటించింది.
హర్యానాలోని కర్నాల్‌లో 1962, మార్చి 17న జన్మించిన కల్పనా చావ్లా.. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్లారు. అనంతరం 1988లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో నుంచి ఎరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పొందారు. 1988లో నాసాలో తన కెరీర్ ప్రారంభించి, 1997లో కొలంబియా స్పేస్ షటిల్‌ను నడిపారు. తర్వాత 2003, ఫిబ్రవరి 1న అదే షటిల్‌లో భూమికి తిరిగి వస్తుండగా పేలిపోవడంతో ఆరుగురు క్రూ సభ్యులతో సహా ఆమె మరణించారు.