మోటార్ సైకిళ్ళతో ఎస్పీ పర్యటన

by Aamani |
మోటార్ సైకిళ్ళతో ఎస్పీ పర్యటన
X

దిశ, ఆదిలాబాద్: ప్రజలు కలిసికట్టుగా కరోనా వైరస్‎ను తరిమి వేసేందుకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో ద్విచక్రవాహనాలపై జిల్లా పోలీస్ అధికారులు, స్పెషల్ గార్డులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందన్నారు. ఈ నెల 30 వరకు ఇలాగే ప్రజలు ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రాకుండా నిర్బంధాన్ని పాటించాలని ఆయన సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈనెలాఖరు వరకు నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేద్దామని ఎస్పీ శశిధర్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డిలు పాల్గొన్నారు

tag: lockdown, SP shashidhar raju, tour, motorcycles

Advertisement

Next Story