- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత జీడీపీ వృద్ధి అంచనాలను సవరించిన ఎస్అండ్‌పీ
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ ‘మెరుగైన’ రికవరీ సాధిస్తున్న సమయంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా మందగించే ప్రమాదముందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్‌పీ తెలిపింది. ఈ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 11 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా జూన్ చివరి నాటికి ‘తీవ్ర’ రూపం దాల్చి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీడీపీ అంచనాల్లో సుమారు 1.2 శాతం కుదించుకుపోవచ్చని, దీంతో వృద్ధి రేటు 9.8 శాతానికి పరిమితమవుతుందని ఎస్అండ్‌పీ వివరించింది. దీనర్థం ఈ ఏడాది తర్వాత రికవరీ పుంజుకుంటోందని భావిస్తున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ దేశంగా ఉన్నప్పటికీ, భారత్‌లో గ్రామీణ జనాభాకు టీకాలు అందించడం అతిపెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడింది.