- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెట్లు నరికితే భవిష్యత్ అంధకారమే: ఎస్పీ శశిధర్ రాజు
దిశ, ఆదిలాబాద్: చెట్లను నరికితే భవిష్యత్ అంధకారం అవుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ గ్రామంలోని ప్రజలకు అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ అడవులను నరికివేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, వర్షాలు రాక పంటలు కూడా పండవన్నారు. పంటలు పండకపోతే తినడానికి తిండి లేక ఆకలి చావులు చూడాల్సి వస్తుందని వివరించారు. చెట్లు లేకపోతే వాతావరణంలో కార్బన్ డై యాక్సైడ్ శాతం పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి దొరక్క అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందన్నారు. కాబట్టి, అడవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చివరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నివారించాలంటే స్వీయ నియంత్రణ పాటించడం ఒక్కటే సరైన మార్గమని గ్రామస్తులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
tags: forest, if trees gone, future will face huge problems, sp shashidhar raju