పోలీస్​ బాస్​ ఎవరు.?

by Aamani |
పోలీస్​ బాస్​ ఎవరు.?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకమైన ఎస్పీ పదవు లు ఖాళీగా ఉండడం పోలీసు యంత్రాంగానికి ఇబ్బందిగా మారుతోంది. ఓ వైపు మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్న తరుణంలో ఈ రెండు జిల్లాల్లో కీలకమైన ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడం పోలీసు అధికారులకు తలనొప్పిగా త యారవుతోంది. జిల్లా విభజనకు ముం దు ఆదిలాబాద్ కేంద్రంగా ఎస్పీ ఉండేవా రు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కేంద్రాల్లో ఐపీఎస్ స్థాయి అదనపు ఎస్పీ లు పని చేసేవారు. జిల్లా విభజన తర్వాత అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఎస్పీలను ని యమించింది. అయితే తాజాగా మంచి ర్యాల జిల్లాను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మార్చారు. అక్కడ డీసీసీ స్థాయి అధికారి పనిచేస్తున్నారు.

నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఖాళీ..!

నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీస్ ​సూపరింటెండెంట్ పోస్టులు ప్ర స్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఎస్పీలు పదవీ విరమణ చేయడం తో నాలుగైదు నెలలుగా ఆ పోస్టులను భర్తీ చేయలేదు. ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్​.వారియర్ కు రెండు జిల్లాల అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో ప్రతి చిన్న పనికి స్థానిక అధికారులు, పోలీసు సిబ్బంది ఆదిలాబాద్ కు వెళ్లాల్సిన పరి స్థితి నెలకొంది. అలాగే పోలీసు కార్యకలాపాల నిర్వహణలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

కీలక సమయంలో ..

నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీ పోస్టు లు ఖాళీగా ఉండడం ఇబ్బందిగా మారుతుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మావోయి స్టు కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో పెరి గాయని పోలీసులు అంగీకరిస్తున్నారు. అందులోనూ ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో భాస్కర్ దళం పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. దీంతో ఆ జిల్లాలో ఎస్పీ నియామకం అత్యంత ఆవశ్యకమని పోలీసులే చెబుతున్నారు. మరో వైపు నిర్మల్ జిల్లాలోను కీలకమైన నక్సల్స్ కదలికలు ఉన్నాయ ని ఇంటలిజెన్స్ వర్గాలు అభి ప్రాయప డుతున్నాయి. దీనికి తోడు మంత్రి ఇం ద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల ప ర్యటనలు, బందో బస్తు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పోస్టుల భర్తీ ఎప్పుడో..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీస్​సూపరింటెండెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కిందిస్థాయి పోలీసు సి బ్బంది కోరుతున్నారు. పోలీసులకు సం బంధించిన సెలవులు, ఇతర అధికారిక కార్యాలయ పనులు జరగాలంటే ఈ స్థా యి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. ఈ రెం డు జిల్లాల ఎస్పీల బాధ్యతలను ఆదిలాబాద్ ఎస్పీకి కట్టబెట్టడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ప్రతి పని కోసం ఆదిలాబాద్ వెళ్లి రావడం ఇబ్బం దిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల డీసీ పీగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి నిర్మల్ ఎస్పీగా వస్తున్నారని పోలీస్ వర్గాల్లో ప్ర చారం ఊపందుకుంది. త్వరలోనే ఆయ నకు నిర్మల్ ఎస్పీగా పోస్టింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా తో పాటు నిర్మల్ ఎస్పీ పోస్టులను ఎప్పుడు భర్తీ చే స్తారు.? ఎవరు ఎస్పీలుగా వస్తారన్న ఉత్కంఠ పోలీస్ వర్గాల్లో ఉంది.

Advertisement

Next Story