రోజూ కషాయం తాగండి.. వాళ్లకు ఎస్పీ ఫోన్

by Shyam |
రోజూ కషాయం తాగండి.. వాళ్లకు ఎస్పీ ఫోన్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులతో స్వయంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కరోనా మహమ్మారి వ్యాప్తి, జాగ్రత్తల గురించి పోలీసు సిబ్బందితో పాటుగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఏమరుపాటు తగదని, శుభ్రత పాటిస్తూ ఆయూష్ వైద్య విభాగం వారి సూచనల మేరకు ప్రతిరోజూ కషాయం తాగాలని, యోగా చేయడం, ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించాలని సూచించారు. విధి నిర్వహణ సందర్భంలోనూ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కుటుంబ సభ్యులు కూడ తమ వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలని ఎస్పీ ఫోన్‌లో కుటుంబ సభ్యులకు చెప్పారు. కరోనా అంటు వ్యాధి ప్రారంభ దశ నుంచి నేటిదాకా సిబ్బంది ఆరోగ్యం పట్ల ఎస్పీ తీసుకుంటున్న ప్రత్యేక చర్యల పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story