నా దృష్టికి తీసుకురండి.. పోలీసులకు ఎస్పీ కోటిరెడ్డి ఆదేశం

by Shyam |
SP Koti Reddy
X

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి లాకప్, ఫైల్స్‌ను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో సన్నిహితంగా మెలగాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య, రురల్ సీఐ రవికుమార్, కేసముద్రం ఎస్ఐ రమేష్ బాబు ఉన్నారు.

Advertisement

Next Story