సమాజం కోసం పోలీసుల నిరంతర శ్రమ: ఎస్పీ చందన దీప్తి

by Shyam |
సమాజం కోసం పోలీసుల నిరంతర శ్రమ: ఎస్పీ చందన దీప్తి
X

దిశ, మెదక్: కరోనాను రూపుమాపడానికి మెదక్ జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఈ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విధినిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా తమ ఆరోగ్యం కోసం పరిశుభ్రతను పాటించాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ చందన దీప్తి స్పష్టం చేశారు.

tag: SP Chandana Deepthi, comments, police, corona Prevention, medak

Advertisement

Next Story