- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రవేశం
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు తెరిపినివ్వకుండానే భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి, విస్తరించాయని ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని చెప్పింది. దీంతో కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో తీరంవెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగుల పడే ప్రమాదం ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, చెరువులు, నీటి కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది.