- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజమాబాద్‌లో సౌతిండియా షాపింగ్ మాల్ ప్రారంభం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అనడానికి ధక్షిణ భారతదేశంలో అతిపెద్ధ షాపింగ్ మాల్ బ్రాంచ్ నిజామాబాద్ లో ప్రారంభించడమే నిదర్శనమని అన్నారు. నిజామాబాద్ నగర ప్రజలకు అందుబాటులో నాణ్యమైన ధరలో బస్టాండ్ పక్కనే గల పాత రమేష్ ధియేటర్ ప్రాంతంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే లా ధరలను ఉంచారని నిజామాబాద్ పట్టణ ప్రజలు తో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గణేష్ గుప్తా కోరారు.
అనంతరం మీడియా సమావేశంలో షాపింగ్ మాల్ డైరెక్టర్ లు సురేష్ సెరన్, అభినయ్, రాకేష్, కేశవ్ మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 23వ షోరూం నిజామాబాద్ లో ఏర్పాటు చేశామని అన్నారు. నిజామాబాద్ పట్టణంలో పెద్ద వస్త్ర ప్రపంచం ఎన్నో హంగులతో నూతన ఒరవడికి కొత్త మోడళ్లతో అనేక రంగుల వస్త్రాలు పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, నూతన వధూవరులకు సరిపడే అన్ని రకాల బట్టలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు ఎన్నో వెరైటీ లతో నిజామాబాద్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభ ఆఫర్ గా 1 గ్రాం బంగారం కోనుగోలు పై 2 గ్రాములా వెండి ఉచితంగా ఇవ్వబడును ప్రకటించారు.
https://www.southindiaeshop.com/
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిజామాబాద్ జిల్లాలోనే 4500 గజాల స్థలం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. షాపింగ్ ప్రారంభోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన ఆఫర్ లను నిజామాబాద్ ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బురుగు పల్లి కల్పన, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.