- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ముడుమాల్ నిలువురాళ్ల’ సందర్శనలో కొరియా బృందం
దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని ముడుమాల గ్రామంలో ఉన్న నిలువు రాళ్లను దక్షిణ కొరియాకు చెందిన గ్వాంగ్జిన్ ప్రావిన్స్ సేజోంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం విద్యార్థులు కిమ్ షెంగ్‌షుక్, కిమ్ యోంగ్జీ, బీఇన్ హో, లీషామీ, ఈగ్జీయోంగ్, జియాంగ్ హు ఆదివారం సందర్శించారు. ఖగోళ పరిజ్ఞానాన్ని గుర్తించే స్కైచార్ట్ ఆనాటి ఆదిమానవులు చారిత్రక ముడుమాల్ నిలువురాళ్లతో ఏర్పాటు చేశారు. జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మఖ్తాల ఈ చారిత్రక సంపదకు యునెస్కో వారసత్వ హోదా స్థాయి ఉందనే విషయాన్ని గుర్తించారు.
దక్షిణ కొరియాకు చెందిన సేజోంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం మీడియాతో మాట్లాడుతూ.. ముడుమాల్ నిలువురాళ్ల సందర్శన తమకు ఎంతో వింత అనుభూతి కలిగించిందన్నారు. 3,500 సంవత్సరాల కిందట ఇంత గొప్ప ఆవిష్కరణ జరగడం అద్భుతమని పేర్కొంటూ నిలువురాళ్లపై పరిశోధన చేస్తామని తెలిపారు. నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అర్హత ఉందని వారు స్పష్టం చేశారు. యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కోసం తమవంతు కృషి చేస్తామని దక్షిణ కొరియా బృందం సందీప్ మఖ్తాలకు హామీ ఇచ్చారు.