- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ వేస్టేజ్ నుంచి ‘స్టూల్స్’
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే ‘మాస్క్’ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మాస్క్‌లకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. కానీ ఎక్కువమంది వీటిని వన్ టైమ్ యూజ్ చేసి పారేస్తుండటంతో ఈ వేస్టేజ్ అంతా పర్యావరణానికి హానికరంగా మారుతోంది. ఓ వైపు ప్లాస్టిక్ పెనుభూతంలా మానవాళిని పట్టి పీడిస్తుంటే.. మరోవైపు కరోనా వల్ల మాస్క్ వేస్టేజ్ కూడా పర్యావరణానికి నష్టం కలిగిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కిమ్ హనియల్ అనే వ్యక్తి.. అందరిలా సమస్యను చూసి వదిలేయలేదు, పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిత్యం వాడిపడేసే మాస్క్‌ల నుంచి ఫర్నిచర్ తయారుచేస్తూ, ప్రస్తుతం అదే పనిని తన బిజినెస్‌గా మార్చుకున్నాడు.
కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా సౌత్ కొరియా ప్రభుత్వం.. సెప్టెంబర్ నెలలో అక్కడి ప్రజలకు బిలియన్ సంఖ్యలో ఫేస్ మాస్క్‌లు సప్లయ్ చేసింది. అయితే ప్రజలు వాడిపడేసిన ఈ మాస్కులు ప్రస్తుతం పర్యావరణానికి హానికరంగా మారడంతో సౌత్ కొరియాలోని యూవంగ్‌కు చెందిన ఫర్నిచర్ డిజైన్ స్టూడెంట్ కిమ్ హనియల్ వాటిని రీసైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ రీయూజబుల్ అయినప్పుడు, ఫేస్ మాస్కుల ద్వారా కొత్త ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదని? ఆలోచించాడు. ఈ మేరకు 1,500 మాస్కులను ఉపయోగించి ఓ స్టూల్‌ను తయారు చేసిన కిమ్.. మూడు కాళ్లున్న ఈ కుర్చీలకు ‘స్టాక్ అండ్ స్టాండ్’ అని నామకరణం చేశాడు.
మాస్క్‌లు కలెక్ట్ చేసేందుకు యువంగ్ సిటీలోని కైవన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ వద్ద కలెక్షన్ బాక్స్ ఏర్పాటు చేశాడు. ఫ్యాక్టరీ నుంచి 10 వేల యూజ్ చేసిన మాస్క్‌లు, వెయ్యి కిలోల డిఫెక్ట్ మాస్కులను కలెక్ట్ చేశాడు. ఈ ఫేస్ మాస్క్‌ల ద్వారా కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీటిని నాలుగు రోజులపాటు స్టోర్ రూంలోనే భద్రపరిచి, ఆ తర్వాత మాస్క్ ఎలాస్టిక్ బ్యాండ్స్ విడదీసి, వాటిని మెర్జ్ చేస్తున్నాడు. 300 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాస్క్‌లను కరిగించి వాటితో మూడు కాళ్ల బల్లలు తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేయబడిన కిమ్ ‘స్టాక్ అండ్ స్టాండ్’ స్టూల్స్‌ను ఇటీవల యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ ఎగ్జిబిషన్‌లో కూడా ప్రదర్శించారు. ఎకనమిక్ ఫ్రెండ్లీ మెథడ్స్ అవలంబించాలనే సందేశాన్ని ఈ ప్రొడక్ట్ ద్వారా ప్రజలకు పంపాలనుకుంటున్నట్లు కిమ్ తెలిపాడు.