888 రైళ్లు నడిపించిన దక్షిణ మధ్య రైల్వే

by Shyam |
888 రైళ్లు నడిపించిన దక్షిణ మధ్య రైల్వే
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన వలస కూలీలు, పర్యాటకలు, విద్యార్థులు, ఇతర ప్రజలను తరలించేందుకు ఇప్పటివరకూ 888 రైళ్లను నడిపించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 648 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపించగా.. మరో 240 శ్రామిక్ రైళ్లను ఆయా రాష్ట్రాల కోరిక మేరకు వివిధ గమ్యస్థానాలకు నడిపించినట్టు తెలిపారు. ఎన్జీఓల సహకారంతో 1.5 లక్షల మందికి భోజనాలు అందించినట్టు రైల్వే విభాగం పేర్కొంది. భోజనాలతో పాటు స్నాక్స్, పిల్లలకు పాలు, తాగు నీరు కూడా అందించారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణిలకు సేవలందించిన అధికారులు, సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనాన్‌ మాల్య అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story