- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దక్షిణ మధ్య రైల్వేకు మూడు ఇంధన పొదుపు అవార్డులు
దిశ,కంటోన్మెంట్: భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ/విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డుల్లో దక్షిణ మధ్య రైల్వే మూడు అవార్డులను సొంతం చేసుకుంది. 2020 సంవత్సరానికి గాను 30వ జాతీయ ఇంధన పొదుపు అవార్డుల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక శాఖ మంత్రి (ఐసీ) ఆర్.కే.సింగ్ న్యూ ఢిల్లీ నుంచి వర్చ్యువల్ కార్యక్రమం ద్వారా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎక్ట్రికల్ ఇంజినీర్ సోమష్ కుమార్‌కు ఈ అవార్డులను అందజేశారు. జాతీయ ఇంధన పొదుపు అవార్డులలో భాగంగా జోన్‌లోని సంబంధిత విభాగాలు ఈ అవార్డులను పొందాయి.
1. పరిశ్రమలు/రైల్వే వర్క్ షాప్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకో షెడ్ ప్రథమ బహుమతి పొందింది.
2. భవనాలు/ప్రభుత్వ కార్యాయాల కేటగిరీలో లేఖా భవన్ (ఎస్‌సీఆర్ అకౌంట్స్ కార్యాలయ భవనం) రెండవ బహుమతి పొందింది
3. ట్రాన్స్‌పోర్ట్/జోనల్ రైల్వేస్ కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే జోన్ మెరిట్ సర్టిఫికెట్ పొందింది.
ఇంధన పొదుపునకు అనేక కార్యక్రమాలు చేపడుతూ, గత 9 సంవత్సరాల నుంచి క్రమంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ/విద్యుత్ మంత్రిత్వ శాఖల నుంచి ఈ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే పొందుతోంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో 3 ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గొప్ప విజయమని, ఇది జోన్ పరిధిలోని ప్రతి ఉద్యోగి నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. దక్షిణ మద్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎక్ట్రికల్ ఇంజనీరును, విజయవాడ, హైదరాబాద్ డివిజన్ల రైల్వే మేనేజర్లను, సంబంధిత ఇతర రైల్వే అధికారులను ఆయన అభినందించారు.