- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే సెంట్రల్ ఆస్పత్రిలో జనరల్ మేనేజర్ తనిఖీలు
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ ఆస్పత్రిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సోమవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సౌకర్యాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మాస్కులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ, స్టోర్స్, ఐసీయూ విభాగాలతో పాటు కరోనా పేషంట్ల కోసం సిద్ధం చేసిన 142 ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. అలాగే, విజయవాడ, గుంతకల్లు రైల్వే ఆస్పత్రుల్లోని వైద్య సౌకర్యాలు, ఐసోలేషన్ వార్డులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రైల్వే ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేసిన అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. అవసరం మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో గజానన్ వెంట ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డా.శ్రీకాంత్ మహాపాత్ర, ఇతర సీనియర్ వైద్యులు ఉన్నారు.
Tags: south central railway, general manager gajanan mallya, railway central hospital, secunderabad, corona, covid 19, railway hospitals