సౌత్‌సెంట్రల్ రైల్వే సరికొత్త రికార్డు..

by Shamantha N |
సౌత్‌సెంట్రల్ రైల్వే సరికొత్త రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే (Scr) సికింద్రాబాద్ డివిజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక్క రోజులోనే 6.76 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్దరణ పనులను దిగ్విజయంగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇండియన్ రైల్వేలో ఇప్పటివరకు ఏ డివిజన్ ఇలాంటి ఘనతను సాధించక పోవడం ఇక్కడ విశేషం. సికింద్రాబాద్ డివిజన్ తన ప్రణాళిక సమన్వయంతో ఈనెల 24, 27వ తేదీల్లో మొత్తం 13.25 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. అనగా, ఒక్కరోజులో 6.50 కిలోమీటర్లు.. మరో రోజు 6.75 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేసింది.

సికింద్రాబాద్ డివిజన్ ప్రతీ ఏడాది సుమారు 130 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల పట్టాలను పునరుద్ధరిస్తుంది. ప్రస్తుతం మహాబుబాబాద్, తాండూర్, బెల్లంపల్లి, మధిర ప్రదేశాల్లోని మార్గాల్లో ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టింది. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా స్పందిస్తూ.. సికింద్రాబాద్ డివిజన్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిగతా పనుల్లోనూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed