- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై నిషేధం
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA)కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (South African Cricket Board)పై నిషేధం విధిస్తున్నామని, తక్షణమే బోర్డు సస్పెన్షన్ అమలులోకి వస్తుందని ఆ దేశ ప్రభుత్వం ఆధీనంలోని ఒలింపిక్ కమిటీ (Olympic Committee) ప్రకటించింది. గత ఏడాది కాలంగా దక్షిణాఫ్రికా జట్టు ఎంపికలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది.
అంతకు ముందే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బోర్డులోని అధికారులు అందరూ వెంటనే పదవుల నుంచి వైదొలగాలని, ఇకపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (South African Cricket Board) ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు.
ఇప్పుడు సీఎస్ఏ (CSA) దక్షిణాఫ్రికా ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్లిపోవడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. జింబాబ్వే, నేపాల్ క్రికెట్ బోర్డుల వ్యవహారంలో అక్కడి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో 2019లో ఐసీసీ వాటి సభ్యత్వాలను రద్దు చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వాలు తమ పర్యవేక్షణను ఉపసంహరించుకున్నాయి. దీంతో తిరిగి జింబాబ్వే, నేపాల్‌ల సభ్యత్వాలను ఐసీసీ పునరుద్దరించింది. ఇప్పడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సభ్యత్వానని కూడా ఐసీసీ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.