టాస్ గెలిచిన సఫారీలు.. టీ20 వరల్డ్‌ కప్‌లో కీలక మ్యాచ్

by Shyam |
టాస్ గెలిచిన సఫారీలు.. టీ20 వరల్డ్‌ కప్‌లో కీలక మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మరికొద్ది క్షణాల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్‌ ఆడే బంగ్లా ఏ మేరకు స్కోరు చేస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే చెరి మూడు మ్యాచులు ఆడిన ఇరుజట్లు రెండు మ్యాచుల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. ఇరు జట్లు కూడా 4 పాయింట్లతో టీ20 సిరీస్‌లో సమానంగా కొనసాగుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Next Story