ఫైనల్ ఎంట్రీ నాట్ గుడ్ : సఫారీ కెప్టెన్

by Shamantha N |   ( Updated:2020-03-06 03:48:49.0  )
ఫైనల్ ఎంట్రీ నాట్ గుడ్ : సఫారీ కెప్టెన్
X

టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఐసీసీ మహిళల టీ20 ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇంగ్లాండ్, ఇండియాల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఇండియా ఫైనల్ చేరింది. ఇక రెండో సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సఫారీలను 5 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఫైనల్స్‌లో ఫ్రీ పాస్ దక్కించుకోవడం కంటే సెమీస్ ఆడి ఓడిపోవడం చాలా బెటరని సఫారీల కెప్టెన్ అన్నది. భారత జట్టు నేరుగా ఫైనల్స్‌కు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భారత జట్టు మోసం చేసి ఫైనల్స్‌కు వెళ్లలేదు కదా.. ఐసీసీ నిబంధనల ప్రకారమే ఫైనల్స్‌లో చోటు దక్కించుకుందని కొందరు అంటుంటే.. సఫారీల కెప్టెన్ ఇలా నోరు పారేసుకోవడం తగదని మరికొందరు సూచిస్తున్నారు.

Tags : ICC, WT20, Semi Final, South Africa captain, team India

Advertisement

Next Story