ఆ బ్యాంకుల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధం

by  |
ఆ బ్యాంకుల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19, ఆర్థిక మాంద్యం (Kovid-19,economic downturn) పరిస్థితులతో బ్యాంకుల అభివృద్ధి (Development of banks) కోసం నిధుల కొరతను అధిగమించేందుకు కేంద్రం బ్యాంకుల ప్రక్షాళన (Banks purge)కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra), ఐడీబీఐ (IDBI),యూకో బ్యాంక్ (UCO Bank), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ (Punjab & Sind Bank)లలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉంది.

ఈ క్రమంలోనే బ్యాంకుల పనితీరు (Performance of banks)లో మెరుగుదల తీసుకురావడానికి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాని (Private company partnership)కి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పై నాలుగు బ్యాంకుల్లోనూ ప్రభుత్వానికి ఉన్న వాటాలోంచి ప్రైవేట్ సంస్థలకు విక్రయించడానికి చర్యలు తీసుకోనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అయితే, నెల రోజుల క్రితం సగానికిపైగా బ్యాంకుల వాటాలను (Shares of banks) ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వార్తలు వినిపించాయి. కొవిడ్-19 (Kovid-19)తో పాటు అనుబంధ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల వాటా విక్రయాల (Share sale of banks) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేయవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు (Banking industry experts) కూడా భావిస్తున్నారు.

అయితే, ఈ అంశంపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) నిరాకరించింది. ప్రస్తుతం భారత్‌లో ఐడీబీఐ (IDBI)తో పాటు డజను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం 47.11 శాతం కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా కంపెనీ ఎల్ఐసీ (Lic) 51 శాతం వాటాను కలిగి ఉంది.


Next Story

Most Viewed