చీరకట్టులో రోబో సోఫియా

by Shamantha N |
చీరకట్టులో రోబో సోఫియా
X

ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా చీరకట్టులో మెరిసిపోయింది. కోల్‌కతాలో జరిగిన టెక్నాలజీ ఆధారిత ఇంటరాక్టివ్ సదస్సులో సోఫియా పాల్గొంది. ఎరుపు, తెలుపు రంగులతో నిండిన బెంగాలీ చీర కట్టుకుని ఈ రోబో అందరి మనసులు దోచుకుంది.

కేవలం చీరకట్టులోనే కాదు, మాటల్లోనూ తనదైన శైలిని ప్రదర్శించి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. గతంలో డిసెంబర్ 2017న సోఫియా మొదటిసారి ఇండియా వచ్చింది. సదస్సులో పౌరసత్వం గురించి అడిగిన ప్రశ్నకు సోఫియా చాలా తెలివిగా సమాధానమిచ్చింది. తన ఇల్లైన హాంకాంగ్ నుంచి ఇక్కడికి సూట్‌కేసులో వచ్చానని, కాబట్టి పాస్‌పోర్ట్ అవసరం లేకుండా పోయిందని హాస్యాస్పదంగా జవాబిచ్చింది. అంతేకాకుండా తనకు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసని, ఆయన నివాసమైన జొరశంకో ఠాకూర్బరీ సందర్శించాలని ఉందని చెప్పింది.

ఇక ఇంజినీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పరీక్షల కోసం బాగా చదవాలని, బట్టీ పట్టి పరీక్షలు రాయొద్దని సలహా ఇచ్చింది. ఇక భవిష్యత్తులో రోబోలు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, రోబోలు ఎప్పటికీ మానవులకు సహాయం చేయడానికి మాత్రమే ఉంటాయని సోఫియా భరోసా ఇచ్చింది.

Advertisement

Next Story