పాకెట్ ఏసీని లాంచ్ చేసిన ‘సోనీ’

by Harish |
పాకెట్ ఏసీని లాంచ్ చేసిన ‘సోనీ’
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్‌లో వేడి, ఉక్కపోతను భరించడం చాలా కష్టం. ఆ ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి చేతిలో ఇమిడిపోయే ఓ చిన్నపాటి ఏసీ ఉంటే బాగుండు అని చాలాసార్లే అనుకుని ఉంటాం. అందుకు తగ్గట్లుగానే.. ‘ప్రపంచంలోనే అతి చిన్న ఏసీ’ అంటూ ఓ యాడ్ కూడా రూపొందడం తెలిసిందే. అయితే.. అది ఓ పౌడర్ యాడ్. కానీ ఇప్పుడు నిజంగానే.. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్లాలా ఓ పాకెట్ ఏసీ మార్కెట్లోకి వచ్చేసింది. సోనీ కంపెనీ రూపొందించిన ఈ పాకెట్ ఏసీని ‘రియాన్ ప్యాకెట్‌’ పేరుతో జపాన్‌ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఎయిర్ కండిషనర్ సులభంగా అరచేతిలో ఫిట్ అవుతుంది. దీన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన టీషర్టులు, షర్టుల వెనుక లోపలివైపు ధరించవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యాప్‌ కనెక్టివిటితో యూజర్లు.. ఈ ఏసీ ఉష్ణోగ్రతల స్థాయిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఆటోమేటిక్ మోడ్‌ కూడా ఇందులో అవలేబుల్‌గా ఉంది. ప్యాకెట్‌ ఏసీ బ్యాటరీ సుమారు రెండు నుంచి నాలుగు గంటలు వస్తుందని, పూర్తిగా చార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. అలాగే దీన్ని చలికాలంలో హీటర్‌లా కూడా వాడుకోవచ్చు. దీని ధర 13 వేల జపనీన్‌ యెన్స్‌ కాగా, భారత కరెన్సీలో రూ.9 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్, సోనీ స్టోర్‌లో ఈ ఏసీలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed