- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొవిడ్ పేషెంట్ కోసం.. అంత సాహసం చేసిన సోను
దిశ, సినిమా : రియల్ హీరో సోనూసూద్ నిస్వార్థ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ కాలం నుంచి ఇప్పటి వరకు పేదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన.. కొవిడ్ -19 కారణంగా 85-90% ఊపిరితిత్తులు పాడైపోయిన ఓ అమ్మాయికి ప్రత్యేక చికిత్స కోసం ఏకంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. ఈ మేరకు అత్యవసర చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించారు.
భారతి అనే అమ్మాయి ఊపిరితిత్తుల సమస్యతో నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతోంది. అయితే ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు తెలపగా.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ECMO చికిత్స అందుబాటులో ఉందని తెలుసుకున్న సోను వైద్యులతో సంప్రదింపులు జరిపాడు. శరీరానికి కృతిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించే వీలుండగా.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తనను అక్కడికి తరలించి ఉత్తమ చికిత్స అందించగలిగాడు. 20% మాత్రమే ఆపరేషన్ సక్సెస్ అయ్యే చాన్స్ ఉందని వైద్యులు తెలిపారన్న సోను.. 25 ఏళ్ల యువతి విషయంలో అవకాశం తీసుకుని ముందుకు వెళ్లామని తెలిపాడు. వెంటనే ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసి తనను హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి చికిత్స అందించామన్నాడు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సోను.. ఇంతటి ఒత్తిడిలోనూ ఓ ప్రాణాన్ని కాపాడటంపై అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్లు.