- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాది స్వార్థం కాదు.. సేవ: సోనూ
లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు దేవుడిగా మారిన సోనూసూద్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అయ్యాయి. రీల్ విలన్ రియల్ హీరో అయ్యాడని, మైగ్రేంట్ వర్కర్స్‌ను ఆదుకున్న నిజమైన హీరో అని ప్రశంసలు కురుస్తుండగా ఇదంతా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తున్నాడని సోనూను విమర్శించాడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. బీజేపీకి కొమ్ము కాస్తున్నాడని ఆయన చేసిన వ్యాఖ్యలు శివసేన పత్రిక ‘సామ్నా’లోనూ ప్రచురితమయ్యాయి.
దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సోనూ ఈ విమర్శలకు చెక్ పెట్టారు. ‘వలస కార్మికులతో నా ప్రయాణం చాలా స్పెషల్’ అని ట్వీట్ చేశారు. ఈ సహాయం నా హృదయం నుంచి వచ్చిందన్న సోనూ.. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు నన్ను సహాయం కోరినా సరే.. వారిని తమ కుటుంబాలతో కలిపేందుకు నా వంతు ప్రయత్నం చేశానని.. ఇది కొనసాగుతుంది’ అని స్పష్టం చేశాడు. ఇక తన పేరుతో ఫేక్ ఎకౌంట్స్ సృష్టించి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని.. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అభిమానులను కోరారు.
https://twitter.com/SonuSood/status/1269664379055640576?s=20