- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనూ సేవలో ‘శవాల శివ..’!
దిశ, ముషీరాబాద్: మానవసేవే మాధవసేవ అన్న నినాదాన్ని నరనరాన జీర్ణించుకున్న అతను సాటి మనిషి ఆపదలో ఉంటే ముందుంటాడు. ముఖ్యంగా ప్రమాదవశాత్తూ మరణించిన, ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న శవాలను వెలికితీస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతనే ట్యాంక్ బండ్ శవాల శివ. తనకు వచ్చిన విరాళాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఓ అంబులెన్స్ కొనుగోలు చేశాడు. అంతేకాదు.. రియల్ హీరో సోను సూద్ పేరు మీద అంబులెన్స్ సర్వీస్ గా నామకరణం చేసి తనతోనే ప్రారంభింపచేశాడు. మంగళవారం ట్యాంకుబండ్ పై జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోను సూద్ ముందుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ట్యాంక్ బండ్ పై ఉన్న అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అంబులెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి శివ చేస్తున్న కృషిని ప్రశంసించారు. యువత సేవాభావాన్ని అలవర్చుకోవాలని, తోటివారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన పూర్తి సహకారం శివకు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం శివ మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. పదిమందికి సేవ చేసేందుకే అంబులెన్స్ కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జై సింహ, పలువురు సినీ ఆర్టిస్టులు, డాన్సర్లు, సోనూసూద్ అభిమానులు పాల్గొన్నారు.