- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు సినిమాలో 'పశుపతి'
‘అమ్మ.. బొమ్మాళి’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకు ప్రాణం పోసిన నటుడు సోనూసుద్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ టాలెండెట్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుంధతి సినిమా సోనూసుద్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందనడంలో సందేహం లేదు. అతడు, జులాయి, దూకుడు, కందిరీగ, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో స్టైలిష్ విలన్‌గానూ మెప్పించాడు. చివరగా అభినేత్రి సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించిన ఆయన..ఇప్పుడో క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిరు 152 మూవీలో కీలక పాత్రను చేజిక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోనూయే ధృవీకరించాడు. చిరుతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. సౌత్ ఇండస్ట్రీ నాకు చాలా గుర్తింపునిచ్చిందని.. మంచి సినిమాలతో తనను అక్కున చేర్చుకున్న తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటానన్నాడు.