- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూర పరిహాసం’
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి ఎలా బయటకు రావాలనే విషయమై కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన తీరుతో దేశంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని ఆరోపించారు. శుక్రవారం ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను రద్దు చేయడం, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కాలినడక సొంతూర్లకు వెళ్తున్న వలస కార్మికుల దుస్థితిపై చర్చించారు. దాదాపు 13 కోట్ల కుటుంబాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం క్రూరంగా విస్మరించిందని సోనియా గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దేశంపై ఓ క్రూర పరిహాసంగా ఆమె అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణలను దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాలను రద్దు చేయడం తదితర చర్యలను గర్హించారు. పార్లమెంట్‌లో చర్చించకుండా ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సోనియాగాంధీ అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని మంటగలిపిందని ఆరోపించారు.