- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు శుభవార్త.. అద్దెకు ‘సొనాలిక’ వ్యవసాయ పరికరాలు
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు కావాల్సిన హైటెక్ వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్టు ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ సొనాలిక గ్రూప్ గురువారం ప్రకటించింది. ‘సొనాలిక అగ్రో సొల్యూషన్స్’ యాప్ ద్వారా రైతులు తమకు దగ్గరలో హైటెక్ వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చే వారితో సంప్రదించేందుకు అవకాశం ఇస్తుంది. రైతుల సౌకర్యంతో పాటు అవసరానికి అనుగుణంగా వివిధ రకాల పరికరాలను ఎంచుకునే విధంగా ఈ యాప్ పని చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘వ్యవసాయ రంగంలో రైతులకు సులభంగా కొత్త టెక్నాలజీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత డిజిటలైజేషన్ వేగవంతంగా జరుగుతున్న ఈ సమయంలో ట్రాక్టర్, ఇతర పరికరాలను అద్దె ద్వారా ఉపయోగించుకునేందుకు ‘సొనాలిక్ గ్రూప్ సొల్యూషన్’ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్ నుంచి తమకు అవసరమైన వాటిని సులభంగా ఎంచుకునే అవకాశం లభిస్తుందని’ సొనాలిక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ అన్నారు. రైతులతో పాటు ఈ యాప్ ద్వారా నైపుణ్యం కలిగిన ఆపరేట్లకు ఉపాధి అవకాశాలను అందించేందుకు వీలవుతుంది. అలాగే, సరైన సమయంలో కావాల్సిన వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉండే ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వివరించారు. వ్యవసాయ పరికరాలను కలిగిన ఆపరేటర్లు ఈ యాప్‌లో ఫ్రీలాన్స్ అద్దెదారుగా నమోదు చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.