నిజామాబాద్‌లో దారుణం.. అనుమానంతో తండ్రిని చంపిన కొడుకు

by Sumithra |

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కన్న తండ్రినే హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన గుంజురు గంగారం (58), గంగాధర్ అనే వీరిద్దరూ తండ్రీకొడుకులు. అయితే గతకొంత కాలంగా ఆస్తి, ఇతర విషయాలకు సంబంధించి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పశువులపాకలో గంగారాం నిద్రిస్తుండగా కొడుకు గంగాధర్ కర్రతో అతడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతను(గంగారాం) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story