కుటుంబ కలహాల నేపథ్యంలో..తండ్రి హత్య

by Shyam |
కుటుంబ కలహాల నేపథ్యంలో..తండ్రి హత్య
X

దిశ, నిజామాబాద్: మానవ సంబంధాలు పూర్తిగా పెడదారి పడుతున్నాయి. కన్నవారు, ఆత్మీయులు, రక్త సంబంధీకులు అని చూడటం లేదు. చిన్నపాటి గొడవలకే విచక్షణ కోల్పొయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు కారణమైతే, మరికొన్ని సందర్భాల్లో మద్యం, వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి.ఈ మధ్యకాలంలో ఈలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో కన్నకొడుకే తండ్రిని దారుణంగా హతమార్చాడు.ఈ ఘటన మంగళవారం మధాహ్నం జరిగింది.పోలీసుల కథనం ప్రకారం..గ్రామంలో వహీద్ ఖాన్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని కొడుకు ఆఫ్సర్ ఖాన్ చికెన్ కొట్టే కత్తితో తండ్రి మెడపై నరికి హత్య చేశాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.

Advertisement

Next Story