తల్లి కోరిందని చంపేసిన తనయుడు

by Anukaran |   ( Updated:2020-07-29 06:32:37.0  )
తల్లి కోరిందని చంపేసిన తనయుడు
X

దిశ, వెబ్ డెస్క్: తన తల్లి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాడు కొడుకు. తల్లి ఆరోగ్యం బాగుపడటం కోసం ఎక్కని ఆసుపత్రుల మెట్లు లేవు. అయినా ఆ తల్లీ ఆరోగ్యం కుదుటపడలేదు. బాధ భరించలేని తల్లి చివరికి తనను చంపేయమని కొడుకును వేడుకుంది. దీంతో అతను తన తల్లి గొంతు కోసి చంపేశాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కాంచీపురంలో సోమవారం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి. కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ పట్టణానికి చెందిన గోవిందమ్మల్(66) క్షయ, డయాబెటిస్‌తో బాధపడుతుంది. రోగం నయం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. అయినా ఫలితం లేకపోవడంతో బాధను భరించలేక తనను చంపేయ్ అని కుమారుడిని వేడుకుంది.

దీంతో కుమారుడు సోమవారం తన తల్లిని కత్తితో గొంతు కోసం చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన తల్లి చంపమంటేనే తాను చంపినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Advertisement

Next Story