కిరాతకం.. కన్నతల్లిని రోకలితో కొట్టి చంపిన కొడుకు

by Sumithra |   ( Updated:2021-10-09 08:18:44.0  )
కిరాతకం.. కన్నతల్లిని రోకలితో కొట్టి చంపిన కొడుకు
X

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని రామచంద్రుని పేట గ్రామానికి చెందిన కల్లూరి పగడమ్మ (75)కు ఇద్దరు కూతుర్లు, ఆరుగురు కొడుకులు ఉన్నారు. వారికి పెళ్లిళ్లై వేరు వేరు కాపురాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఏడవ సంతానం కలిగిన కల్లూరి నరసింహారావు(43) తాగుడికి బానిసై రోజూ ఇంట్లో గొడవ చేస్తున్నాడు. దీంతో ఆయన భార్య 6 నెలల క్రితం పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నరసింహారావు తన తల్లి దగ్గరే ఉంటున్నాడు. తాగుడికి బానిసైన అతను రోజూ తాగడానికి తల్లిని డబ్బులు ఇవ్వమని వేధించేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో తాగడం కోసం పగడమ్మని డబ్బులు అడగ్గా.. ఆమె లేవని చెప్పడంతో పక్కనే ఉన్న రోకలి కర్రతో ముఖం మీద ఎడమవైపు కొట్టి మెడలో ఉన్న నల్లపూసల తాడు తెంపి బంగారపు కాసులు పట్టుకుని పారిపోయాడు. దీనిపై మృతురాలి కొడుకు వీరాస్వామి ఫిర్యాదుతో ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేశారు. అనంతరం హత్య జరిగిన స్థలానికి వెళ్లి విచారణ జరిపి మృతదేహాన్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement

Next Story