- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అప్పు’ చేసి ‘అమ్మ’ను చంపాడు
దిశ, వెబ్‌డెస్క్: అప్పు చేసి అమ్మను చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన భద్రాచలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గతేడాది డిసెంబర్ 23వ తేదిన భద్రాచలంలో అనుమానాస్పదస్థితిలో పార్వతమ్మ మృతదేహం లభ్యం అయింది. తన తల్లి చావుపై విచారణ చేపట్టాలని పెద్ద కుమారుడు యర్రంశెట్టి వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసింది చిన్న కొడుకు శ్రీనివాస్‌రావు అని గుర్తించారు.
తల్లికొడుకుల మధ్య కొనసాగుతున్న రూ. 9 లక్షల అప్పు కోసమే హత్య చేసినట్టు విచారణలో వెల్లడించారు. పార్వతమ్మ దగ్గర రూ. 9 లక్షలు అప్పుగా తీసుకున్న శ్రీనివాస్‌రావు ఇవ్వకుండా తప్పించుకుతిరిగేవాడు. దీంతో ఓ సారి డబ్బులు ఇస్తావా ఇయ్యవా అంటూ తల్లి గట్టిగా మందలించింది. దీంతో శ్రీనివాస్‌రావు అమ్మపై పగ పెంచుకున్నాడు. ఇక పథకం ప్రకారం పార్వతమ్మను హత్య చేసి ఒంటిపై ఉన్న గొలుసు, చెవి కమ్మలు, అప్పుకు సంబంధించిన నోటరీలను బీరువా నుంచి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు నటించసాగాడు. కానీ, నిజం ఎప్పటి దాగదు అన్నట్టుగానే తొందరలోనే బయటపడ్డాడు. చిన్న కుమారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు వారి పద్ధతిలో విచారించగా.. హత్య చేసింది తానేనని అసలు నిజం చెప్పాడు.