తండ్రిని చంపిన కొడుకు..!

by Sumithra |
తండ్రిని చంపిన కొడుకు..!
X

దిశ, మహబూబాబాద్:

కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ ఆ ఇంటి పెద్ద హత్యకు దారి తీసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బానోత్ బావుసింగ్, తన కొడుకు సుమన్‎లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తండ్రి బానోత్ బావుసింగ్‎ను కొడుకు సుమన్ కర్రతో కొట్టాడు. దీంతో బావుసింగ్‎ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య కౌసల్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ పోలీసులు‌‌ తెలిపారు.

Advertisement

Next Story