- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైన వేరుశనగ బస్తాలు.. కింద అక్రమ మద్యం
దిశ, నల్లగొండ: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే విస్తుపోవాల్సి వస్తోంది. అసలు ఆ ఆలోచనలు ఎట్లొస్తున్నాయో అర్థం కావడంలేదంటూ మరికొందరు అంటున్నారు. మద్యాన్ని తరలించేందుకు వాళ్ల ప్రయత్నాలు చివరి క్షణంలో మాత్రమే బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి స్కూటీ ముందు భాగంలో భారీగా మద్యం బాటిళ్లను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే రీతిలో నేడు కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఏపీకి మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద కోదాడ పట్టణం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ పట్టణంలోని ఓ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి.. వేరుశనగల తరలింపు ముసుగులో.. వేరుశనగల కింద మద్యం బాటిళ్లను దాచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రెండు ఆటోలను సీజ్ చేసి.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.