మహిళ బొమ్మ.. మధ్యలో ఓ అమ్మాయి ఫొటో

by srinivas |
మహిళ బొమ్మ.. మధ్యలో ఓ అమ్మాయి ఫొటో
X

దిశ, వెబ్ డెస్క్: రాకెట్ యుగంలో నూతన సాంకేతికత ప్రజా జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. ఒకప్పుడు కరెంట్ వెలుగు చూడని గ్రామాల్లో ఈరోజు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాలంతో ప్రపంచంలో ఏమూల ఎప్పుడు ఎం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాము. ఇంతలా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఏదో ఓ మూల నేటికీ చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి క్రుద్రపూజలను నమ్మేవారున్నాంటే అతిశయోక్తి కాదు.

నెల్లూరు జిల్లా కావలి వద్ద కనిపించిన కుద్రపూజల ఆనవాళ్లే అందుకు నిదర్శనం. కావలి సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు కుద్రపూజలు నిర్వహించినట్లు కొన్ని గుర్తులు కనిపించాయి. సున్నంతో ఓ మహిళ బొమ్మను గీసి ఆ బొమ్మ మధ్యలో ఓ అమ్మాయి ఫొటో ఉంచారు. గుమ్మడి కాయ, నిమ్మకాలు, పసుపు, కుంకుమతో అక్కడంతా భయానకంగా ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఇది ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.

Advertisement

Next Story

Most Viewed