నేడు ఖగోళంలో అద్భుత దృశ్యం

by Shamantha N |
నేడు ఖగోళంలో అద్భుత దృశ్యం
X

నేడు ఖగోళంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డురావడంతో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 9.15 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం 12.10 గంటల వరకు కనబడనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు గ్రహణం ముగిసిపోనుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ప్రాంతాలను బట్టి గ్రహణ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు, ఏపీలో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.44 వరకూ సూర్యగ్రహణం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 51 శాతం గ్రహణమే కనిపించనుంది. ఇక, హైదరాబాద్‌లో పాక్షిక గ్రహణమే కనిపించనుంది. ఇక, ఈ సమయంలో పడే అతినీలలోహిత కిరణాలతో 0.001 శాతం కరోనా వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని శనివారం రాత్రి 8.50 గంటలకు మూసివేశారు. ఆదివారం భక్తులకు దర్శనం పూర్తిగా రద్దు చేశారు. సోమవారం నుంచి దర్శనం తిరిగి ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. గుజరాత్‌లో నేటి గ్రహణం తొలిసారిగా కనిపిస్తుందని, అసోంలోని దిబ్రూగఢ్‌లో మధ్యాహ్నం ముగుస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి రఘునందన్ వెల్లడించారు. రింగ్ ఆఫ్ ఫైర్‌ను రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ వాసులు చూడవచ్చు. ఈ గ్రహణాన్ని నేరుగా చూడరాదని, రక్షణ జాగ్రత్తలు పాటిస్తూ చూడవచ్చని సలహా ఇచ్చారు.

Advertisement

Next Story