బైక్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

by Sumithra |
బైక్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మమబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గార్ల మండలం పెద కిష్టాపురం గ్రామనికి చెందిన బాణోత్ రామ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతంపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే గల కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed