ముంబైలో సాఫ్ట్‌వేర్ జాబ్.. దాని కోసం ఉరేసుకుని ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2021-08-26 10:54:42.0  )
software
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడు ఆకుల రాజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవల స్వగ్రామానికి వచ్చిన అతను పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులు కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితకుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed