- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు వారి జీతాలు నేనే బరిస్తా…
దిశ, వీపనగండ్ల: మండలంలోని తూముకుంట పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన జరగడం లేదు. తన సొంత ఖర్చులతో ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు గ్రామానికి వాల మదన్మోహన్ రావు నలుగురు విద్యావలంటీర్లను నియమించారు. గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో పలు సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంఘ సేవకులు వాల మదన్మోహన్రావు దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే ఆయన విద్యార్థులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సబ్జెక్టులను బోధించడానికి జిల్లా పరిషత్ పాఠశాలకు కృష్ణమ్మ, మమత లను ప్రాథమిక పాఠశాలకు ఆద్య, మాసుమ్ లను పాఠశాల ఉపాధ్యాయుల సూచనతో నియమించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు నలుగురు జీతాలు తానే చెల్లిస్తానని వివరించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా మదన్మోహన్రావు కు పాఠశాల ఉపాధ్యాయులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహన్, పిఎస్ ప్రధానోపాధ్యాయురాలు శిరీష, తిరుమలేష్ చారి, కేశవులు, నాగరాజు, కురుమయ్య, పాల్గొన్నారు.